telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మీడియా స్వేచ్ఛను హరించే .. జీవో 2430 రద్దు చేయాలి .. : టీడీపీ

tdp protest on go2430 at assembly

ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మీడియాకు సంకెళ్లు వేసి దారుణంగా ప్రవర్తిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అసెంబ్లీకి కొన్ని ఛానళ్ల నిరాకరణపై చంద్రబాబు నేతృత్వంలో తెదేపా నిరసన చేపట్టింది. జీవో 2430ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది.

సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నేతలు నోరు, చేతులు, కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. మీడియాపై 2430 తీసుకొచ్చి బెదిరించడం దుర్మార్గం అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయం చంద్రబాబు అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే వరకు పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts