telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అంగన్‌వాడీలు చిన్నారులను కన్న తల్లుల్లా చూసుకోవాలి: మంత్రి సత్యవతి

sathyavathi rathod

అంగన్‌వాడీ టీచర్లు చిన్నారులను కన్న తల్లుల్లా చూసుకోవాలని తెలంగాణ గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రథోడ్‌ అన్నారు. పోషణ అభియాన్‌ కింద అమలు చేస్తున్న గిరిపోషణ్‌ పథకంపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో పని చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

గిరిపోషణ్‌ ద్వారా 6 కోట్ల రూపాయలతో 414 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 13వేల మందికి పోషకాహారం అందిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ పథకాన్ని గిరిజన ప్రాంతాలన్నింటికీ విస్తరించేలా సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తామనీ, తద్వారా ఆయన కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి గిరిజనులకు లబ్ది చేకూరుస్తారని మంత్రి మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts