telugu navyamedia
సినిమా వార్తలు

నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాదంటున్న ఆలీ..!

సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకున్న సినిమా బ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేశ్, ఆలీలతో పాటు మెట్రోట్రైన్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. అంతేకాదు ఆలీ ఇందులో నిర్మ‌తగా వ్య‌వ‌హారిస్తున్నారు. నటునిగా ఆలీ దాదాపు 1100 చిత్రాల్లో నటించి తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.

గతేడాది ఓటిటి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. చక్కని మెసేజ్‌తో పాటు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విత్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ చిత్రం అందరిని ఆలోచింప చేస్తుంది.

ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయిన సందర్భంగా మా సినిమా ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ చిత్రానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చూసిన ఐదుగురు సభ్యుల బృందం నాతోపాటు మా టీమ్‌తో మాట్లాడుతూ చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమాని చూశాం అని ప్రశంసిస్తుంటే మేము పడిన కష్టం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.

నేను ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను. సెన్సార్‌ వారి ప్రశంసల తర్వాత ఈ సినిమా చేసే విషయంలో నా డెసిషన్‌ కరెక్టే అని అర్థమయింది. సూపర్‌స్టార్‌ కృష్ణగారు, ప్రభాస్, సోనూసుద్, సమంతాలు మా సినిమా ప్రమోషన్‌లో పాలు పంచుకుని నన్ను ఆశీర్వదించినందుకు వారికి నా ధన్యవాదాలు. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ హీరోతో విడుదల చేయిస్తాము. అక్కడే సినిమా విడుదల తేదిని కూడా ప్రకటిస్తాను’’ నటుడు, చిత్ర నిర్మాత ఆలీ అన్నారు.

rspnetwork.in: Andaru Bagundali Andulo Nenundali Movie Opening

అంతేకాదు..ఆలీగారు నాకు గత 20 ఏళ్లుగా తెలుసు. ఎన్నోసార్లు నేను మీతో సినిమా చేస్తాను అన్నయ్య అనేవాణ్ని. ఆలీగారు నేను చెప్పినప్పుడు సినిమా చేద్దువుగాని అని ఇన్నిరోజులు వెయిట్‌ చేయించారు. ఆలీ అన్న ఇన్ని రోజులు ఎందుకు ఆగమన్నారో సినిమా చూసిన తర్వాత నాకిప్పుడు అర్థమయ్యింది. ఇంత గొప్పసినిమా తీసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా అని నిర్మాతల్లో ఒకరైన మోహన్‌ కొణతాల అన్నారు.

కాగా.. ఈ చిత్రానికి అలీ, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదంను ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నారు.

Related posts