telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వ్యాక్సిన్‌ వేసుకున్న వారానికే.. నగ్మాకు కరోనా

Nagma

మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరూ క్రేజులు తగ్గుతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.  ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. కరోనా బారీన పడి చాలా మంది కోలుకున్నారు కూడా. అయితే.. ఇప్పుడు వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ… కరోనా సోకుతుంది. దీంతో అందరిలోనూ కలవరం మొదలైంది. తాజాగా.. ప్రముఖ నటి, కాంగ్రెస్‌ నేత నగ్మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నగ్మా ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2న ఆమె ముంబైలో కరోనా ఫస్ట్‌ డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే… కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నా.. తాజాగా నగ్మా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉండి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. నగ్మా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

Related posts