telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింగర్ సునీతకు రెండో పెళ్లి.. !ఎవరితో తెలుసా

singer sunitha

సింగర్‌ సునీత పేరు తెలియని వారుండరు. శాస్త్రీయ సంగీతం అయినా… పాప్‌ పాట అయినా సునీత శైలిలో పాడితే వినేందుకు అభిమానులు ఎంతో అతృతగా రెడీ అయిపోతారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ… పైకి మాత్రం ఆమె సంతోషంగా కనిపిస్తుంది. సునీతకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లియింది. ఇద్దరు పిల్లలు పుట్టాక… భర్త తీరుతో విసిగిపోయిన సునీత.. చాలా ఏళ్లుగా ఆయనకు దూరంగా ఉంటుంది. ఇటీవల ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. తాను ఎప్పటికీ సింగిల్‌గానే ఉంటానని.. పుకార్లు నమ్మొద్దని పేర్కొన్నారు. తాజాగా.. ఆమె ఓ బిజినెస్‌ మ్యాన్‌ ని వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఇది వరకే పెళ్లయిందని అంటున్నారు. ఈ అంశం మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సునీతకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఆమె త్వరలో ఈ మేరకు ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఆమె ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. అప్పటి వరకు అందరూ ఆగాల్సిందే..

Related posts