telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా “దళారీ” ట్రైలర్ లాంచ్.

ముఖ్య అతిథి సి . కళ్యాణ్ మాట్లాడుతూ… ట్రైలర్ చూస్తుంటే చాలా మాస్ గా ఉంది. వెంకట్ రెడ్డి గారు ఇండస్ట్రీ కు రావడం ఆనందించాల్సిన విషయం. కొత్త నిర్మాతలు ఇండస్ట్రీ కు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. టీమ్ అందరికీ మంచిపేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

అతిథి రామ్ దాసు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ… ట్రైలర్ చాలా బాగుంది.. మాస్ ఎక్కువ కనపడుతోంది. దాదాపు 4కోట్ల బడ్జెట్ తో తీసినట్టున్నారు. చిన్న సినిమా అంటే సి. కళ్యాణ్ గారు తప్పకుండా ఉంటారు. ఈ రోజు ఆయనతో దళారీ ట్రైలర్ లాంచ్ చేయించడం నిజంగా అభినందించాల్సిన విషయం అన్నారు.

ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఈ “దళారీ”  సినిమా ను ఆకృతి క్రియేషన్స్ పతాకంపై విడుదల చేయనున్నాము. సినిమా తీయడం ఎంత కష్టం ఉంటుందో, టైం కూడా అంతే ముఖ్యం, ఇందులో పని చేసిన వారందరూ చాలా ఇష్టం తో పని చేశారు. ఈ సినిమా డిసెంబర్ 15న విడుదల చేయనున్నాం అన్నారు.

డైరెక్టర్ గోపాల్ రెడ్డి మాటలాడుతూ…  సొసైటీ లో ఏ పని జరగాలన్నా ఒక దళారీ అనే వాడు ఉంటాడు. అలాంటి దళారీ పాత్ర రాజకీయం లో ఉంటే ఎలా ఉంటుందో తెలిపేదే ఈ మా “దళారీ” చిత్రం. ఇది మా సినిమానే కాదు అందరి సినిమా అని అన్నారు.

ముఖ్య అతిథులతో సహా ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, టి ఎన్ రాజు, సలీం, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత: వెంకట్ రెడ్డి
కొరియోగ్రఫీ: రాజ్ పైడ
రచన- దర్శకత్వం: కాచిడి గోపాల్ రెడ్డి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, సురేష్ గంగుల
మ్యూజిక్: హరి గౌరీ
డి ఓ పి: మెంటం సతీష్,
ఎడిటర్: నందమూరి హరి,
పి ఆర్ ఓ: బాబు నాయక్ ( సినీ లోకం మ్యాగ్ జైన్)

Related posts