అమెరికా నటుడు, గాయకుడు నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత ప్రియాంక తన దృష్టిని పూర్తిగా హాలీవుడ్‌పైనే కేంద్రీకరించింది. ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంది. తాజాగా ఆమెరికన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోతొలిసారి రాజకీయాల గురించి మాట్లాడింది. “అవకాశం లభిస్తే నేను భారత ప్రధాన మంత్రిని అవుతా. నా భర్త నిక్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. సాధారణంగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. రాజకీయాలతో ముడిపడిన అంశాలు నాకు నచ్చవు. కానీ సమాజంలో మార్పు రావాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము” అని ప్రియాంక చెప్పింది. అయితే ప్రియాంక సరదాగా ఈ వ్యాఖ్యలు చేసిందా ? లేదా రాజకీయాలపై నిజంగానే దృష్టి సారించిందా ? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
previous post