telugu navyamedia
సినిమా వార్తలు

హీరోయిన్ కు ప్రేమ పేరుతో హీరో వేధింపులు… తల్లి ఫిర్యాదు

Shadow

ప్రముఖ దర్శకుడు బాలా శిష్యుడు నందన్‌ సుబ్బరాయన్‌ తొలిసారిగా తెరకెక్కించిన “మయూరన్‌” చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇందులో అముదవానన్ హీరోగా నటించగా.. మిస్ ఇండియా ఫెమినా కిరీటాన్ని గెలుచుకున్న అశ్మిత హీరోయిన్ గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం నాడు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అశ్మితను హీరో అముదవానన్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. ఈ సినిమాకు సంబంధించి హీరో పాల్గొనే ఏ కార్యక్రమంలోనైనా అశ్రిత పాల్గొనబోదని ఆమె తెగేసి చెప్పింది. కోటీశ్వరురాలైన తన కూతురిని హీరో ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని ఆరోపించింది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హీరో కూడా మొండికేస్తున్నాడు. హీరోయిన్ రానప్పుడు తాను మాత్రం ఎందుకు రావాలని అతను ప్రశ్నిస్తున్నాడు.సినిమా విడుదల దగ్గరపడిన సందర్భంలో హీరో హీరోయిన్లు ఇలా చేయడంపై దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు జ్యోతిక “జాక్‌పాట్”, మరోవైపు “కళుగు” చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో..తమ చిత్రానికి సరైన ప్రచారం లేకపోతే ప్రేక్షకులకు చేరలేదని వారు వాపోతున్నారు. పోనీ నడిఘర్ సంఘం వద్దకు వెళ్దామన్నా.. సంఘం ఎన్నికల ఫలితాలు ఇంకా తేలకపోవడంతో.. అక్కడా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలియక దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

Related posts