telugu navyamedia
సినిమా వార్తలు

“భారత్” కథ ఇదే… కేసు కొట్టేసిన హైకోర్టు

Bharat

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన “భారత్” చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసి పుచ్చింది. భారత్ సినిమా టైటిల్ సెక్షన్-౩ ఉల్లంఘన (చిహ్నాలు, పేర్లు) కిందకు వస్తుంది. భారత్ పేరును వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో… సినిమా విడుదలను నిలిపేయాలని పిల్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబినేషన్ లో తెరెకెక్కిన భారత్ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమా 2014లో వచ్చిన కొరియా సినిమా “ఆడ్ టు మై ఫాదర్” సినిమాకు రీమేక్. ఈ సినిమాలో సల్మాన్ యువకుని దశ నుంచి 70 ఏళ్ల వృద్ధుని వరకూ కనిపించే పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కొరియా యద్ధం బ్యాక్ గ్రౌండ్‌తో సాగుతుంది. ఈ సినిమా కథ 1950లలో ప్రారంభమవుతుంది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య జరిగిన యుద్ధం నేపధ్యంలో సినిమా నడుస్తుంది. ఈ సమయంలో పలువురు శరణార్థులుగా మారుతారు. వారిలో డ్యూక్ అనే వ్యక్తి తన చెల్లెలికి దూరమవుతాడు. అప్పటి నుంచి డ్యూక్ తన చెల్లెలిని కలుసుకోవాలని తపించిపోతుంటాడు. ఈ కొరియా సినిమాలో హీరో తన కుటుంబ పోషణ కోసం గనిలో పనిచేస్తుంటాడు. అదే విధంగా ‘భారత్’ సినిమాలో సల్మాన్ బొగ్గు గనిలో పనిచేస్తుండటం సినిమా ట్రైలర్‌లో కనిపిస్తుంది. ఈ సమయంలోనే అతను ఒక యువతి ప్రేమలో పడతాడు. ఈ సినిమా కథ 1950లో మొదలై 60, 70, 80 వ దశాబ్దాల మధ్య కాలాల్లో వివిధ మలుపులు తిరుగుతూ కొనసాగుతుంది.

Related posts