telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరుణ్‌ ధావన్‌పై జెర్సీ బ్యూటీ కామెట్స్‌..

బాలీవుడ్ లో లెటెస్ట్ గా యంగ్ హీరో వరుణ్ ధవన్ ఓ ఇంటి వాడయ్యాడు. ఆన్ స్క్రీన్ బ్యూటీని కాకుండా నటాషా దలాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ ని పెళ్లాడాడు. వీరిద్దరి మధ్యా వ్యవహారం నడుస్తోందని ముంబై గ్లామర్ ప్రపంచంలో అందరికీ తెలిసిందే. గత కొన్నాళ్లుగా వరుణ్ ధవన్ అభిమానులకి కూడా నటాషా గురించి తెలిసిపోయింది. అందుకే, తమ బహిరంగ రహస్యాన్ని బ్యాండ్ బాజా బారాత్ దాకా తీసుకొచ్చేశారు వరుణ్ అండ్ నటాషా. అయితే, ఓ హీరో పెళ్లి అన్నాక ఇండస్ట్రీలో హడావిడి మామూలుగా ఉంటుందా? సొషల్ మీడియాలో వెడ్డింగ్ ఆఫ్ వరుణ్ ట్రెండింగ్ గా మారిపోయింది! వరుణ్‌ ధవన్ కి బోలెడు మంది బాలీవుడ్ సెలబ్స్ శుభాకాంక్షలు చెప్పారు. అయితే…. ఆ జోడికి విషెస్ చెప్పిన జెర్సీ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌..ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరో నటుడిని వెండితెరపై చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఇతర హీరోయిన్లతో నటించేందుకు అతని భార్య, బంధువులు ఒప్పుకోకపోవచ్చు. భవిష్యత్తులో అతడు హీరో ఓరియెంటెడ్‌ చిత్రాలే చేస్తాడేమో..ఇక పై వరుణ్‌ను మిస్‌ అవుతామని శ్రద్ధ కామెంట్‌ చేసింది.

Related posts