telugu navyamedia
సినిమా వార్తలు

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

Shoban Babu
శోభన్ బాబు ఆంధ్రులకు అందాల నటుడు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణించాడు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుని ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. “సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు. శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. అందులో భాగంగానే అప్పట్లో శోభన్ బాబు తన మొదటి పాప పుట్టినరోజుకు గౌను కొనడానికి ఎంత కష్టపడ్డారనే విషయాన్ని తెలియజేస్తున్నాము.   
shobhan-babu-2
శోభన్ బాబు మొదటి పాప మృదుల… పాప మొదటి పుట్టినరోజుకు చక్కని గౌను, మంచి ఆటబొమ్మలు కొనాలనుకున్నారు శోభన్ బాబు. అప్పటికే శోభన్ బాబు అయిదారు చిత్రాల్లో చిన్నా చితక వేషాలు వేశారు. పెద్దగా సినిమా ఆఫర్లు లేవు. ముందుకుగానీ వెనక్కుగానీ వెళ్లలేని పరిస్థితి. పాపకు డ్రెస్సు, బొమ్మలు కొనాలంటే కనీసం రెండు మూడొందలయినా కావాలి. ఈరోజుల్లో రెండొందలు అంటే పెద్దగా లెక్కలేకపోవచ్చు. కానీ అప్పట్లో అదే పదివేలు. శోభన్ బాబు దగ్గర డబ్బుల్లేవు. ఆయన అప్పటికే నర్తనశాల సినిమాలో అభిమన్యుడుగా నటిస్తున్నారు. అందుకే నర్తనశాల నిర్మాతను డబ్బులు అడగాలని నిర్ణయించుకుని మైలాపూర్ లో ఉన్న ఆయన ఆఫీస్ కు వెళ్ళడానికి సాయంత్రం 4 గంటలకు సిటీ బస్సెక్కారు. 
Shoban Babu Cinema Life History
ఆరోజు శనివారం. రాజ్యం పిక్చర్స్ అధినేత, నర్తనశాల నిర్మాత శ్రీధర్ రావు గారి ఇల్లు, ఆఫీస్ ఒకటే. అక్కడికి వెళ్లేసరికి శ్రీధర్ రావు అక్కడ లేరు. ఆయన భార్య శ్రీమతి  లక్ష్మీరాజ్యం గారితో కలిసి ఆయన అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లారని, ఏడు గంటలకు వస్తారని ఆఫీస్ బాయ్ చెప్పాడు. కానీ అప్పటికి టైం ఇంకా నాలుగే… ఇంకా మూడు గంటలు ఎదురుచూడాలి. ఉందామా ? వెళదామా ? అనుకుంటుండగా… కూతురుకు మొదటి పుట్టినరోజు నాడు ఒక్క గౌను కూడా కొనలేకపోతున్నాననే అనే బాధ మనసులో నిండిపోయింది శోభన్ బాబుకు. అందుకే పాపకోసం మూడు గంటలే కాదు… మూడు జన్మలైనా ఎదురు చూడాలని నిర్ణయించుకుని అక్కడే పడిగాపులు పడ్డారు శోభన్ బాబు. టైం ఏడు… శ్రీధర్ రావు గారు ఇంకా రాలేదు… టైం ఎనిమిది… ఆయన వచ్చారు.  
shobhan-babu1
ఆయనను కలిసి విషయం చెప్పారు శోభన్ బాబు. “మేనేజర్ ఇంటికెళ్లిపోయాడయ్యా… రేపు ఆదివారం… ఎల్లుండి సోమవారం వచ్చి కలువు. డబ్బులు ఇస్తాను అన్నారాయన. “రేపే పుట్టినరోజండీ…” అన్నారు శోభన్ బాబు. శ్రీధర్ రావు గారు రెండొందల రూపాయలకు చెక్కు రాసిచ్చారు. చెక్కు ఉంటే ఏంటి లాభం… డబ్బులు కదా కావాలి… అయినా సరే శోభన్ బాబు ఆ చెక్కును తీసుకుని నేరుగా మిత్రుడు కొమ్మినేని శేషగిరిరావు దగ్గరకు వెళ్లారు. మిత్రునితో విషయం చెప్పి “ఈ చెక్కు తీసుకుని రెండు వందలు ఇవ్వు… ఎల్లుండి చెక్కు మార్చి నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను” అన్నారు శోభన్ బాబు. కొమ్మినేని సరేనని డబ్బు ఇచ్చారు. అలా శోభన్ బాబు తన బంగారు పాప కోసం చిన్న గౌను కొన్నారు. ఇలా రెండొందల కోసం అప్పట్లో శోభన్ బాబు ఇంత కష్టపడ్డారన్నమాట.
shobhan-babu ntr-with-shobhan-babu shobhan-babu shobhan-babu

 

 

Related posts