telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరస్సులో శవంగా మారిన ప్రముఖ నిర్మాత

Producer

పోలండ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత పియోటిర్‌ వొజ్నియాక్‌-స్టారక్‌ సరస్సులో శవమై తేలాడు. ఆయన వయసు 39 సంవత్సరాలు. పియోటిర్‌ వొజ్నియాక్‌ పోలండ్‌లో పలు పాపులర్‌ సినిమాలను తెరకెక్కించారు. పియోటిర్‌ పినతండ్రి జెర్జీ స్టారక్‌ పోలండ్‌లోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచారు. శనివారం పియోటిర్‌ వొజ్నియాక్‌ మిస్సింగ్‌ కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కిసజ్నో సరస్సుకు సమీపంలో ఖాళీగా ఉన్న మోటార్‌ బోటును గుర్తించారు. ఈశాన్య పోలండ్‌ ప్రాంతంలో ఉన్న కిసజ్నో సరస్సు పరిసర ప్రాంతాల్లో గాలించగా..నీటిపై తేలియాడుతన్న శవాన్ని గుర్తించారు. డెడ్‌బాడీని వెలికితీసి పియోటిర్‌ వొజ్నియాక్‌దిగా గుర్తించామని పోలండ్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి జరొస్లా జీలిన్‌స్కీ తెలిపారు. పియోటిర్‌ వొజ్నియాక్‌ ఆకస్మిక మరణం పట్ల జరొస్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related posts