telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ సీనియర్ నటి మృతి

Padmadevi

కన్నడ సినిమా రంగంలో తొలిచిత్రం భక్తద్రువ (1934)లో నటించిన ప్రముఖ సీనియర్‌ నటి కె.పద్మాదేవి గురువారం కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. 1936లో విడుదలైన “సంసారనౌక” సినిమా పద్మాదేవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాలో నాలుగు పాటలు సైతం ఆమె పాడారు. ఒక పాటను స్వంతంగా వీణ వాయిస్తూ పాడటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.. వసంతసేన, భక్తసుధామ, జాతకఫల వంటి సినిమాలలోను ఆమె నటించారు. మధుగిరి మీనాక్షిగా పేరు మార్చుకుని రెండు సినిమాలలోను నటించారు. ముక్తి, అమరమధుర ప్రేమ, సంక్రాంతి సినిమాలలో నటించిన పద్మాదేవి ఆకాశవాణితో పాటు పత్రికారంగంలోను పని చేశారు. బెంగళూరుకు చెందిన పద్మాదేవి బళ్ళారి రాఘవాచార్యులు ద్వారా నాటకరంగంలో ప్రవేశించి హెచ్‌ఎల్‌ఎన్‌ నాటక సంస్థలో నటించారు. అనంతరం ఆమె సొంతంగా కంపెనీని కొనసాగించారు. సినిమారంగం కంటే రంగస్థలంలోనే ఆమె ఎక్కువ కాలం కొనసాగారు. పద్మాదేవి మనవడు సింగపూర్‌లో నివసిస్తున్నారు. అతడు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related posts