మూడో విడత ఎన్నికల్లో భాగంగా కేరళలో ఇవాళ పోలింగ్ కొనసాగుతోంది. మలయాళ స్టార్ యాక్టర్లు మమ్ముట్టి, మోహన్ లాల్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోచి, తిరువనంతపురంలోని పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరు నటులు ఓటు వేశారు. ఇద్దరు యాక్టర్లు క్యూలైనులో నిలబడి అందరితో కలిసి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన మమ్ముట్టి, మోహన్ లాల్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడుత ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. మూడో విడుతలో13 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది.
previous post
రామ్ గోపాల్ వర్మనే పెళ్లిచేసుకునేదాన్ని కానీ : గాయత్రీ గుప్త