telugu navyamedia
సినిమా వార్తలు

మ‌న‌సున్న మారాజు..మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం

సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు మ‌న‌సున్న మ‌నిష‌ని మ‌రోసారి చాటుకున్నారు. సినిమాల్లోనే సూపర్ స్టార్ కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ సూపర్ స్టారే.. అనిపించుకుంటున్న మహేశ్‌ చిన్నారులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారు పాలిట మహేష్ దేవుడిగా మారారు.

పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధ‌ప‌డుతూ ఆర్ధికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే 1000కిపైగా చిన్నారులకు హార్ట్‌ సర్జరీలు చేయించిన మహేష్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు.

అందులో భాగంగానే మహేష్ రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చేపట్టిన పూయర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించారు. లిటిల్ హార్ట్ ఫౌండేషన్ ను లోగోను సూపర్‌స్టార్‌ అవిష్కరించారు.

ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి తన జీఎంబీ ఫౌండేషన్‌ పనిచేస్తుందన్నారు మహేష్‌. చిన్న పిల్లల గుండె సమస్యల పట్ల రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చేస్తున్న వైద్య సేవలను మహేష్ బాబు ప్రశంసించారు.

ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు..

Related posts