వెంకటేష్ – నాగచైతన్య నటిస్తున్న చిత్రం లోగో ద్వారా వాళ్ళు అభిమానులకు ఉగాది గిఫ్ట్ ఇచ్చేశారు. వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ చిత్రానికి సంబంధించి టైటిల్ లోగో, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది యూనిట్. వెంకటేష్, నాగచైతన్యలు ధాన్యం బస్తాలపై చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌తోపాటు ఆర్మీ నేపథ్యంలో స్టోరీ సాగుతున్నట్లు తెలుస్తోంది.
పోస్టర్‌లో కనిపించిన టూ వీలర్స్‌పై ‘జై జవాన్.. జైకిసాన్’ టైటిల్ కనిపిస్తోంది. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్. సురేశ్ ప్రొడక్షన్స్-పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రానికి కె.ఎస్ రవీంద్ర డైరెక్టర్. ఉగాది దర్శనమిచ్చిన ఈ మామ అల్లుళ్లు.. వెండితెరపై ఏ మేరకు హంగామా చేస్తారో చూడాలి.