నేషనల్ అవార్డ్ పొందిన కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గణేష్ ఆచార్య తనని మానసికంగా, శారీరికంగా వేధిస్తున్నట్టు గణేష్ ఆచార్యపై ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్‌తో పాటు, మహారాష్ట్ర ఉమెన్స్ కమీషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకి వచ్చే ఆదాయంలో కమీషన్‌తో పాటు అడల్ట్ వీడియోస్ చూడాలని బలవంత పెడుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. గతంలోను ఆచార్య పలు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. భారతదేశంలో మీటూ ఉద్యమం సందర్భంగా తనూశ్రీ దత్తా కూడా గణేష్‌పై విరుచుకుపడ్డారు. కొరియోగ్రాఫర్ గణేష్ “హానికరమైన పుకార్లు” వ్యాప్తి చేయడంతో పాటు, వృత్తిపరమైన ప్రతిష్టను నాశనం చేసాడని ఆమె అప్పట్లో ఆరోపించింది. అక్షయ్ కుమార్ “టాయ్‌లెట్ ఎక్ ప్రేమ్ కథా” చిత్రంలో “గోరీ తు లత్ మార్” అనే సాంగ్‌కి కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ ఆచార్య 2018లో బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డ్ పొందిన సంగతి తెలిసిందే. సింబా, జీరో, పద్మావత్, సంజు, జుడ్వా2 వంటి చిత్రాలలో పలు సూపర్ హిట్ సాంగ్స్‌కి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు గణేష్.
next post
ఆమెపై ఉమ్మేస్తే జనాలు నాపై ఉమ్మేస్తారు… అయినా ఉమ్మేశా… : నాగశౌర్య