ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఇవాళ “జగనన్న తోడు” స్కీముని ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. జగనన్న తోడు స్కీములో భాగంగా చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల రుణం ఇప్పించనుంది ప్రభుత్వం. పది లక్షల మంది లబ్దిదారులకు జగనన్న తోడు స్కీమ్ కింద రుణం ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులను గుర్తించిన ప్రభుత్వం…. సుమారు 3.60 లక్షల దరఖాస్తుల్ని వివిధ బ్యాంకులకు పంపారు అధికారులు. గుర్తించిన చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వనుంది జగన్ సర్కార్. జగనన్న తోడు స్కీము ప్రారంభోత్సవ నేపథ్యంలో మంత్రులకు ఆహ్వానం పంపారు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ్ జైన్. కొండపల్లి బొమ్మలతో వినూత్నంగా జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు పంపారు అజేయ్ జైన్. చెక్కతో ఆహ్వాన పత్రికను రూపొందించిన మంత్రులకు అందచేసారు అజేయ్ జైన్.
previous post
‘దీదీ’కి కంటిమీద కునుకు కరువైంది: మోదీ