విజయాలకు పొంగిపోము..అపజయాలకు కుంగిపోమని టీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన టీఆర్‌ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏ ఎన్నిక అయినా..గెలుపు మావైపే నిలించిందని పేర్కొన్నారు. గతంలో ఇదే చెప్పామని.. ఇప్పుడు ఇదే చెప్తున్నామన్నారు. దుబ్బాక లో టిఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రతి ఓక్కరికి కృతజ్ఞతలు చెప్పారు మంత్రి కేటీఆర్. పార్టీ కోసం పనిచేసిన హరీష్ రావు తో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలని.. మేము ఆశించిన ఫలితం రాలేదని పేర్కొన్నారు. ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసిందని… మా నాయకులకు ఒక హెచ్చరికలా ఈ ఓటమి ని భావిస్తామని తెలిపారు. మేము అప్రమత్తం కావడానికి ఈ ఎన్నిక తోడ్పడుతుందని… ఓటమి కి గల కారణాలు సమీక్షించంకుంటామని వెల్లడించారు. ఓటమి తో కుంగిపోకుండా.. సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతామన్నారు కేటీఆర్.
previous post