telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా టిక్కెట్ రేట్స్ పై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ఇప్పుడు కొద్దిరోజులుగా అనేక విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఆయన ఇటీవలి చిత్రాలు నేరుగా డిజిటల్ విడుద‌ల కావ‌డం సురేష్ బాబు అందరికీ టార్గెట్ గా మారాడు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా టికెట్స్ రేట్స్ విషయం చర్చమశనీయంగా మారింది.. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే వేయాలని.. అదనపు షోలకు అవకాశం లేదు అని స్పష్టం చేసింది. చిన్న సినిమా,పెద్ద సినిమా తేడా లేదు…కేవలం నాలుగు షో లు మాత్రమే వేయాలని, అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్ ఉండాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక న్యూస్ చానల్ కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో థియేటర్లు నడపడం కష్టం అని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత టిక్కెట్ రేట్లు వల్ల నిర్మాత లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. టిక్కెట్ రేట్లు పై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని అన్నారు.

“మార్కెట్‌లో ప్రతి ఉత్పత్తికి ఒక ధర ఉంటుంది. సినిమా టిక్కెట్ల ధరలను పరిమితం చేయడం తెలివైన పని కాదు… దీనివల్ల భారీ బడ్జెట్ చిత్రాలు తమ పెట్టుబడులను రికవరీ చేసుకోలేక తీవ్రంగా నష్టపోతాయి. ఒకట్రెండు రోజులు మాత్రమే అమ్ముడయ్యే బ్లాక్ టిక్కెట్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. టిక్కెట్ ధరలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ప్రస్తుత టిక్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడం కూడా థియేటర్ యజమానులకు చాలా కష్టం అవుతుంది.  సినిమా నిర్మించిన నిర్మాత కు దాని ధర నిర్ణయంచుకునే అవకాశం ఉండాలని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. మన సినిమా పరిశ్రమను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.  పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎగ్జిబిషన్ పరిశ్రమ నాశనమై పోతుంది’’ అని సురేష్ బాబు అభిప్రాయ‌ప‌డ్డారు.

Related posts