telugu navyamedia
సినిమా వార్తలు

ఓ యంగ్ హీరోయిన్‌తో నాగ చైత‌న్య డేటింగ్‌ .. రియాక్ట్ అయిన స‌మంత‌.. ట్వీట్ వైర‌ల్‌

విడాకుల తర్వాత అటు సమంత, ఇటు నాగ చైతన్య నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరూ తమ తమ కెరీర్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ.. వాళ్ల పర్సనల్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. హీరోయిన్ శోభితా ధూళిపాళ తో చైతూ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 చై సామ్ డివోర్స్ మ్యాటర్ వీరిరువురి అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. అయితే ఆ తర్వాత సమంత, చైతూ తమ కెరీర్‌పై దృష్టి పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నాగ చైతన్య రెండో పెళ్ళికి సంబంధించిన ఎన్నో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.

దీనిపై ఓ నెటిజన్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. ఇదంతా సామ్​కు చెందిన స‌మంత పి.ఆర్ టీమ్ క్రియేట్ చేసిందంటూ నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ అంటున్నార‌ని, స‌మంత పి.ఆర్ టీమ్‌ను చైతు ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారంటూ ట్వీట్ చేశాడుమొత్తంగా ఈ ఇద్దరి ఫ్యాన్స్​ మధ్య సోషల్​మీడియాలో పెద్ద రచ్చే జరిగి ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

 అంతేకాదు ఒకే కారులో శోభిత ధూళిపాళ, నాగ చైతన్య తెగ చక్కర్లు కొడుతున్నారట. ఇటీవల మేజర్ సినిమా షూటింగ్ సమయంలో కూడా శోభితను కలవడానికి నాగ చైతన్య చాలా సార్లు వచ్చారని తెలుస్తోంది. దీంతో నాగ చైతన్య డేటింగ్ ఇష్యూ ఒక్కసారిగా జనాల్లో హాట్ ఇష్యూ అయింది.

 

దీనికి స‌మంత రియాక్ట్ అయ్యింది. త‌న‌దైన స్టైల్లో గ‌ట్టిగానే ఇచ్చేసింది. అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే అనుకుంటారు. అబ్బాయిపై పుకార్లు వస్తే అమ్మాయే చేయించిదనుకుంటారు ఇకనైనా ఎదగండి అబ్బాయిలూ.. ఎదగండి. ఈ విషయంలో సంబంధం ఉన్నవాళ్లు ..అన్నీ మర్చిపోయి ముందుకు సాగిపోతున్నారు.. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.. మీ పని, కుటుంబం మీద దృష్టి పెట్టండి” అంటూ ఘాటు బదులిచ్చింది.

 నాగ చైతన్య కూడా త్వరలో ధాంక్యూ మూవీతో పాటు లాల్ సింగ్ చద్దా మూవీలతో పలకరించనున్నాడు. మరోవైపు వెంకట్ ప్రభు దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకోవైపు అమెజాన్ ప్రైమ్‌లో ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌తో చైతూ పలకరించనున్నాడు. (File/Photo)

ఇక సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’, లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ‘దూత’అనే వెబ్‌ సిరీస్‌ కూడా త్వరలోనే రిలీజ్‌ కానుంది.

కాఇక సమంత త్వరలోనే​.. శాకుంతలం, యశోద చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్​దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తోంది. మరోవైపు నాగ చైతన్య నటించిన ‘లాల్​ సింగ్​ చద్ధా’, ‘థ్యాంక్యూ’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మరి ప్రాజెక్ట్స్​లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Related posts