telugu navyamedia
తెలంగాణ వార్తలు

గవర్నర్ తమిళసై కాశీయాత్ర..

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కాశీక్షేత్రాన్ని సందర్శించారు. కాశీ విశ్వేరుడు, అన్నపూర్ణాదేవిలను దర్శించుకున్నారు. గంగానదిలో ప్రత్యేక బోటెక్కి ఘాట్లను పరిశీలించారు. నమామి గంగ ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళిక అమల్లో ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు.

శనివారం ఆమె ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం సందర్శనలో…. దశ అశ్వమేధ ఘాట్ కు విచ్చేశారు… అక్కడి నుంచి ప్రత్యేక బోటు ద్వారా కాశీలోని పలు ఘాట్ లను సందర్శించారు… కాశీ క్షేత్రం సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు… గంగా నదిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు..

ఇందుకోసం ప్రధాని తనకు వచ్చిన బహుమతులు, మెమెంటోలు వేలం వేసి ఆడబ్బును కూడా గంగా నది పరిరక్షణకే వినియోగిస్తున్నారని అన్నారు.. ప్రస్తుతం గంగా నీరు ప్రపంచంలోనే అత్యుత్తమ మైన నీరుగా… ఒక డాక్టర్ గా తాను ఈ మాటలు చెప్తున్నానని అన్నారు… ప్రజలు అంతా కూడా సంతోషంగా తమ యాత్రను చేస్తున్నారని ప్రస్తావించారు.

Related posts