ఐటీ ఉద్యోగులతోపాటు నగర ప్రజలు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ వరకు మెట్రో ప్రయాణం త్వరలో ప్రారంభం కానుంది. మరో వారం రోజుల్లో హైటెక్‌సిటీ వరకు మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. కారిడార్-3కు సంబంధించి ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రాగా, అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు గల 10 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో ట్రయల్న్ ప్రారంభించి, రక్షణపరమైన తనిఖీలు కూడా చేపట్టారు.
ఈ ఎనిమిది స్టేషన్ల 10 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వస్తే నాగోల్ నుంచి హైటెక్‌సిటీ సమీపంలోని ట్రైడెంట్ హోటల్ వరకు రాకపోకలు సాగించేందుకు వీలుకలుగనున్నది. హైటెక్‌సిటీ వద్ద రివర్సల్ సౌలభ్యం లేకపోవడం అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు చేపట్టే ఆపరేషన్స్ ట్విన్ సింగిల్‌లైన్ విధానంలో జరుగుతాయి. ఈ విధానం వల్ల మెట్రోరైళ్లు ఒకే లైన్ నుంచి వెళ్లి తిరిగి అదేలైన్‌లో వెనుకకు రానున్నాయి. రెండు లైన్లు సిద్ధమైనప్పటికీ, రెండు లైన్లపై రాకపోకలు ఒకే డైరెక్షన్‌లో సాగనున్నాయి.
బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఉత్తమ్