కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో విషాదం నెలకొంది. కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందారు. మరో 90మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా కొందరి పరిస్థితి విషయమంగా వున్నట్లు తెలుస్తోంది.గ్రామంలో రోజు సరఫరా అయ్యే మంచినీటిని తాగిన తర్వాతే చాలామంది అస్వస్థతకు గురైనట్లు కోమలంచ గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆ నీటిని మిగతా వారు తాగకుండా జాగ్రత్త పడటంతో ఫెను ప్రమాదం తప్పిందన్నారు. అయితే అప్పటికే ఈ నీటిని తాగిన రుచిత, సత్యనారాయణ అనే ఇద్దరు చిన్నారులతో సహా సునీత అనే వివాహిత మృతిచెందింది.