telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సినిమా వార్తలు

దాసరి ప్రభు కోసం గాలిస్తున్న పోలీసులు

Dasari-PRabhu

దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు తారక ప్రభు ఈ నెల 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. తారక ప్రభు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. తన పెద్ద భార్య సుశీల, అత్తతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు భావిస్తున్న పోలీసులు వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రభు తన వద్ద సెల్‌ఫోన్ కూడా లేకుండా జాగ్రత్త పడడంతో లొకేషన్ తెలుసుకోవడం కష్టంగా మారింది.

ప్రభు తొలుత చిత్తూరు వెళ్లి అక్కడి నుంచి భార్య, అత్తను తీసుకుని తిరుపతి వెళ్లాడు. 12న మియాపూర్ వచ్చి అక్కడ రెండు రోజులు గడిపాడు. అయితే, పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసిన ఆయన అక్కడి నుంచి కూడా వెళ్లిపోయాడు. అయితే, వీరంతా ఎక్కడ ఉన్నారన్న విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts