telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రణీత మంచి మనసు … ఆమెని చూసి నేర్చుకోవాలంటూ…

praneeta

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా రోజువారి కూలీ పనులు చేసుకునే జీవితాన్ని కొనసాగిస్తున్న జనాలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. ఈ క్రమంలో వలస కూలీలకు అండగా ప్రముఖులు విరాళాలతో పటు ఆహారాన్ని కూడా పంచుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఈ కరోనా ఆపత్కాల పరిస్థితుల్లో అలాంటి గొప్ప పనులు చేస్తూ ఉదారత చాటుకుంటున్నారు కొందరు మనసున్న మంచి మనుషులు. అందులో ప్రణీత ఒకరు. తానే స్వయంగా వంట చేసి, ఆ వంటకాలను ప్యాకెట్ల రూపంలో పేదవారికి చేరవేస్తోంది. లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఈ 21 రోజుల్లోనే 75 వేల ఆహార పొట్లాలను అందించి ఆకలి తీర్చింది. ఈ మేరకు ముఖానికి మాస్కు ధరించి వంట చేస్తున్నప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రణీత. ఇదివరకే సినీ రంగంలో పనిచేసే యాభై కుటుంబాల సహాయార్ధం లక్ష రూపాయల విరాళం అందించిన ప్రణీత.. మరోసారి ఇలా తన గొప్పమనసు చాటుకుంది. ప్రణీతను చూసి పెద్ద హీరోయిన్స్ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. 

Related posts