telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత 100 కేజీలు ఎత్తేసింది… వీడియో వైరల్… !!

Samantha

సమంత అక్కినేని ఫిట్ నెస్ విషయంలో కూడా ఎక్కడలేని శ్రద్ధ తీసుకుంటుంది. ఇప్పటికే జిమ్‌లో చెమటలు కక్కుతూనే ఉంటుంది స్యామ్. తాజాగా ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా 100 కేజీల బరువులు ఎత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మూడు పదుల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది సమంత. కష్టమైన వర్కౌట్స్ కూడా చాలా సింపుల్‌గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కొన్నాళ్ల కింద 100 కేజీలు లిఫ్ట్ చేసి ఔరా అనిపించిన సమంత.. ఇప్పుడు మరోసారి అదే ఫీట్ చేసి చూపించింది. ఇప్పుడు సమంత ఎత్తిన 100 కేజీల లోడ్ చూసి బాపురే అంటున్నారు ఫ్యాన్స్. ఫిజికల్ ఫిట్ నెస్‌పై సమంతకు ఉన్న శ్రద్దను చూసి ముచ్చటేస్తుంది అంటున్నారు నెటిజన్స్. జాను తర్వాత ఇంకా సినిమాలేవీ కమిటవ్వలేదు సమంత. తమిళనాట విజయ్ సేతుపతి సినిమాలో కమిటైనా కూడా ఇప్పుడు తప్పుకుందని తెలుస్తుంది.

Related posts