*రేవంత్ రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి ఫైర్
*సోనియాకు నేనెప్పుడు అన్యాయం చేయలేదు
*రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్..
*రేవంత్ రెడ్డి నీ బ్రాండ్ బ్లాక్ మెయిలర్
*నా పై ఆరోపణలకు సిగ్గూశరం ఉంటే నిరూపించు..
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంట్రాక్ట్‌ల కోసం అమ్ముడుపోయానని ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి. ..సిగ్గు శరం ఉంటే బీజేపీతో కాంట్రాక్టు తీసుకున్నట్లు నిరూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.
ఒక వేళ నిరూపించకపోతే లేదంటే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. తాను దేనికైనా సిద్ధమేనని.. రేవంత్ బహిరంగ చర్చ సిద్ధమేనా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్ అని.. అవకాశ రాజకీయ వాది అని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు
పీసీసీ పదవిని రేవంత్ డబ్బులతో కొన్నాడని ఆరోపించారు. పీసీసీ పదవిని అడ్డుపెట్టుకుని వేలకోట్లు సంపాదిస్తున్నారు.
సోనియాగాంధీని తానెప్పుడూ అవమానపర్చలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సోనియాను బలిదేవత అన్నది రేవంత్ ఒక్కడేనని అన్నారు.తాను బతికున్నంత వరకు కాంగ్రెస్‌ను విమర్శించనని చెప్పారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ కార్యకర్తలను విమర్శించే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం, కుటుంబపాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లు తెలిపారు.
తెలంగాణలో పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీని ఖతం చేశాడని ధ్వజమెత్తారు. పీసీసీ ప్రెసిడెంట్ అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్లాన్ చేసుకున్నాడని విమర్శించారు. 4 పార్టీలు మారిన వ్యక్తి నా మీద నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారా. ఏ వ్యాపారం లేనిది కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. ఎంపీగా పాలమూరులో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. సీమాంధ్రుల ఓట్ల కోసం మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశాడని అన్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడితే మునుగోడులో బట్టలు విప్పి కొడుతారని.. తన కోసం ప్రాణం ఇచ్చే ప్రజలు ఉన్నారని చెప్పారు.
పీసీసీ అయ్యాక రేవంత్ రెడ్డి ఇంటికి వస్తానని అడిగితే వద్దంటే వద్దని చెప్పానని, జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి ఇంటికి వస్తే మలినం అవుతుందనే వద్దని అన్న తెలిపారు. బయట ఒక ముప్పావు గంట మాట్లాడానని చెప్పారు. నువ్వు ఎంత ఉన్నావని.. నన్ను తొక్కుతువా?’’ అంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి చంద్రబాబుకు ఇచ్చాడని, స్పీకర్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికకు భయపడి ఉత్తుత్తి రాజీనామా చేశాడని ప్రస్తావించారు.
నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, తెలంగాణలో ఉద్యమంలో ఏనాడైనా జైలుకెళ్లాడా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన వ్యాపారస్తులను బ్లాక్‌మెయిల్ చేస్తాడని ఆరోపించారు. వ్యాపారం చేయకుండానే ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని రేవంత్‌ను నిలదీశారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు.
సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్