telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను అబ్బాయిలను ముద్దు పెట్టుకోను… ప్రియాంక గాంధీ మరిది సంచలన వ్యాఖ్యలు

Tehseen

తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్-3 షో పూర్తయ్యింది. రాహుల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 షో వివాదాలతో ఆసక్తికరంగా సాగుతోంది. పలువురు బుల్లితెర నటులతో పాటు ఈ షోలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మరిది టెహ్సీన్ పూనావాలా కూడా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా టెహ్సీన్‌కి, సిద్ధార్థ్ శుక్లాకి మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. దాంతో సిద్ధార్థ్ కోపం కంట్రోల్ చేసుకోలేక.. “ఏంటి టెహ్సీన్ నన్ను ముద్దుపెట్టుకుంటావా?” అని అడిగాడు. ఇందుకు టెహ్సీన్ స్పందిస్తూ.. “నేను అబ్బాయిల్ని ముద్దుపెట్టుకోను. సిగరెట్ల కంపు కొడుతుంది. నా ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి” అన్నాడు. అయితే సిద్ధార్థ్ అక్కడితో ఆగలేదు. ‘కానీ నువ్వు చేసే పనులకు మాటలకు సంబంధం లేదు. నువ్వు రాజకీయ నాయకుడివి అవుతావా?’ అంటూ టెహ్సీన్ స్వలింగ సంపర్కుడని ఇన్ డైరెక్ట్‌గా ఎగతాళి చేశాడు. టెహ్సీన్ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సోదరుడు. ఇతను కాంగ్రెస్‌కు పొలిటికల్ ఎనలిస్ట్‌గా పనిచేసేవాడు. అయితే ఆయన బిగ్ బాస్ షోలోకి ఎలా వచ్చాడనేది ఎవరికీ అర్థం కాని విషయం. అయితే ఇదివరకు సీజన్స్‌తో పోలిస్తే ఈ బిగ్ బాస్ సీజన్‌కు అంత పాపులారిటీ రావడంలేదు.

Related posts