ఇవాళ తెలంగాణలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టం నుండి 0.9కి మీ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీన పడిందని… ఈ రోజు తక్కువ ఎత్తులో గాలులు దక్షిణ, నైరుతి దిశ నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తూన్నాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ రోజు (8వ.తేదీ) ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. అదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ మరియు వికారాబాద్ జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉందని… మిగతా జిల్లాలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి (9,10వ తేదీలలో) పొడి వాతావరణము ఏర్పడే అవకాశం ఉండనున్నట్లు వెల్లడించింది.
వాతావరణ హెచ్చరికలు:-
ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
previous post