తెలంగాణలో ఆశాడ బోనాల జాతర కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులు పోటెత్తారు. కాంగ్రెస్ నేత విజయశాంతి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సినీ నటి పూనమ్ కౌర్ కూడా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ, మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటే మరింత మెరుగ్గా ఆడతానని తెలిపింది. అమ్మవారికి బోనాలు సమర్పించడం పట్ల సింధు హర్షం వ్యక్తం చేసింది.
సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు సమర్పించిన అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదు: మంత్రి బొత్స