telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఆది శక్తి స్వరూపం… ఓ మహిళ

మహికి ఉన్నంత ఓర్పు

కలిగిన ఓ మహిళా అభివాదము.

మాతృత్వాన్ని పుణికి

పుచ్చుకొన్నప్పుడే

నీలోని ఆడతనానికి

అర్ధం పరమార్ధం.

 

మాతృత్వం మమకారానికి

మధురమైన మాధుర్యం.

ఆ అదృష్టం అందరికీ రాదు.

కడుపు పండాలి

కన్నతల్లిగా లాలిపాడే

వరం ఎన్నో కలల పంట.

 

అమ్మతనం అనేది

ఎంతో కమ్మనైనది.

అమ్మా అనే పిలుపు

ఆడ తనానికి

మృధు మధురమైన

ఆ దేవుడిచ్చిన వరం.

 

నాడు దేవ దేవుడు

ఇద్దరి తల్లులకు

కడుపు పంటైనాడు.

ఒకరు దేవకి కన్నతల్లైతే

మరొకరు పెంచిన తల్లిగా

యశోద అయినది.

 

ఆవిధంగా ఆ దేవ దేవుడే

మహిళా శిరోమణులకు

మాతృత్వాన్ని కలిగించాడు.

మాతృత్వమనే వరాన్ని పొందిన

ఓ మహిళా వందనం అభివందనం.

 

మహిళాదినోత్సవ సందర్భంగా

నా మదిలో రేగిన భావ పరంపరగా

ఓ కవిత..

Related posts