telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తొలిసారిగా డ్యూయల్ రోల్ చేస్తున్న నిఖిల్..?

Nikhil

మంచి కథలతో అందరికీ దగ్గరైన హీరో నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు చిత్ర సీమలో అరంగేట్రం చేసిన నిఖిల్ తర్వాత కొన్ని విజయాలను అందుకున్నాడు. వెంటనే వరుస అపజయాలను చవిచూశాడు. అయితే ఈ మధ్య అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మళ్లీ హిట్ ట్రాక్‌లో పడ్డాడులే అనుకున్నాక నిఖిల్ ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు. అయితే నిఖిల్ వరుస సినిమాలు చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. నిఖిల్ తాజాగా చేస్తున్న చిత్రం 18పేజెస్. ఇందులో అనుపమ పదమేశ్వరన్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దీనికి స్టార్ దర్శకుడు సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లేను అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుకుమార్ భాగస్వామి కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇందులో నిఖిల్ తొలిసారిగా రెండు పాత్రల్లో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒక పాత్ర మెమరీ లాస్ నేపథ్యంలో సాగుతుందని అర్థం అవుతోంది. మరి చూడాలి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది అనేది.

Related posts