telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4” వీకెండ్ ఎపిసోడ్ కు భారీ టీఆర్పీ

Nag

బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కావాల్సినంత వినోదం అందుతోంది. ఆటలు, పాటలు, టాస్క్‌లతోపాటు హౌజ్‌లో అందానికి కూడా కొదవేలేదు. ఈ సీజన్‌లో గంగవ్వ మినహా ప్రస్తుతం ఉన్న అమ్మాయిలంతా దాదాపు యంగ్‌ వారే కావడంతో కంటెస్టెంట్ల మధ్య బోలెడంత లవ్‌ట్రాక్‌లు నడుస్తున్నాయి. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త టాస్క్‌లు,స్కిట్‌లతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఎంత పెద్ద షో అయినప్పటికీ సరైన హోస్ట్ లేకపోతే దానికి అంతగా ప్రేక్షకాదరణ ఉండదు. కానీ కింగ్ నాగార్జున అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ 4 షోను మరో లెవెల్ కు తీసుకెళ్లింది అని చెప్పాలి. ఈ గ్రాండ్ రియాలిటీ షో మొదలయ్యి ఇప్పటికే మూడు వారాలు కావస్తుంది. అయితే ప్రతీ వీకెండ్స్ లో హోస్ట్ గా నాగ్ వస్తారన్న సంగతి తెలిసిందే. అలా నాగ్ హోస్ట్ చేసిన గత సెప్టెంబర్ 19, 20వ తేదీలలో ఎపిసోడ్స్ కు గట్టి టీఆర్పీనే వచ్చినట్టు తెలుస్తుంది. శనివారం ఎపిసోడ్ కు గాను 9.6 టీఆర్పీ రాగా ఆదివారం ఎపిసోడ్ కు మాత్రం 13కి పైగా టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో వీకెండ్స్ లో నాగ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారో చూడొచ్చు. పైగా ఇదే వీకెండ్స్ లో సస్పెన్సఫుల్ గా ఎలిమినేషన్స్ ఉండటం మరింత ప్లస్ అయ్యింది.

కాగా బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌లోనూ ఓ ఎపిసోడ్‌ను ఫ్యాషన్‌ షోకు కేటాయించే సంప్రదాయం కొనసాగుతోంది. అలాగే ఈ సీజన్‌లో కూడా నేడు బిగ్‌బాస్‌ హౌజ్‌లో ష్యాషన్‌ షో జరగనుంది. అయితే ఈ ఫ్యాషన్‌ షోలో ఇంటి సభ్యులందరూ సంప్రదాయమైన దుస్తులను ధరించాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లందరూ తమ ట్రెడీషనల్‌ లుక్‌లో జిగేలు మనిపించారు. అబ్బాయిలంతా కుర్తా దుస్తుల్లో స్టేజ్‌పై ర్యాంప్‌ వాక్‌తో అదరగొట్టగా..ఇక అమ్మాయిలయితే తమ అందచందాలతో మైమరిస్తూ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. చీర కట్టుతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలాగా మెరిసిపోతున్నారు. అంతేగాక బిగ్‌బాస్‌ గ్యాంగ్‌ అంతా స్టేజ్‌ మీదకు వచ్చి డాన్స్‌లతో కెవ్వు మనిపించనున్నారు. ఆ తర్వాత అవినాష్‌ ఇంట్లోని ఆడవాళ్లకు అద్దంలా మారబోతున్నాడు.

Related posts