telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రెడ్” ప్రమోషన్ కోసం స్పెషల్ ప్లానింగ్స్

Red

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన మాళవికా శర్మ హీరోయిన్ గా నటించగా నివేతా పెతురాజ్ కీలక పాత్రలో నటించింది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. దీనితో ఈ చిత్రానికి కూడా ఓటిటి ఆఫర్స్ వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం మొత్తానికి ఏఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈలోగా రామ్ తన చిత్ర యూనిట్ తో ఈ గ్యాప్ లో కూర్చొని స్పెషల్ ప్లానింగ్స్ వేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం విడుదల సమయానికి ప్రత్యేకంగా ప్రమోషన్స్ జరపాలని సూచించాడట. దీనితో అదే ప్లానింగ్ లో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం.

Related posts