telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రంగస్థలానికి ఒక కొత్త ఆటగాడొచ్చాడు “అతడే శ్రీమన్నారాయణ”… ట్రైలర్

Srimannarayana

హీరోయిన్ రష్మిక మందన మాజీ ప్రియుడు, కన్నడ దర్శక నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. షాన్వి శ్రీవాస్తవ హీరోయిన్. బాలాజి మనోహర్, అచ్యుత కుమార్, ప్రమోద్ శెట్టి, మధుసూధన్ రావు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సచిన్ దర్శకత్వం వహించారు. పుష్కర మల్లికార్జునయ్య నిర్మాత. అజనీష్ లోక్‌నాథ్, చరణ్ రాజ్ సంగీతం సమకూర్చారు. కన్నడలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మొత్తం ఐదు భాషల్లో విడుదలవుతోంది. కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోన్న ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. తమిళంలో ధనుష్, మలయాళంలో నివిన్ పాల్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్విట్టర్ ద్వారా ట్రైలర్‌ను ప్రేక్షకులతో పంచుకున్న నాని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అతడే శ్రీమన్నారాయణ’ ట్రైలర్ కొత్తగా ఉంది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ‘అతడే శ్రీమన్నారాయణ’ ట్రైలర్‌లో డైలాగులు బాగా పేలాయి. ‘‘ఒక నాయకుడి ప్రస్థానంలో రెండు యుద్ధాలు.. రణరంగంలో ఒకటి, అంతరంగంలో ఒకటి’’, ‘‘దారితప్పిన వాళ్లను క్షమించొచ్చు.. తప్పుడు దారి పట్టినవాళ్లని కాదు’’, ‘‘రంగస్థలానికి ఒక కొత్త ఆటగాడొచ్చాడని అర్థం’’, ‘‘ఆడుతూ వెళ్తే వెయ్యెత్తులు, వెతుకుతూ వెళ్తే వెయ్యి సమాధానాలు. కానీ ఒక జవాబు నిన్నే వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు అడగాల్సింది సరైన ప్రశ్న’’ వంటి డైలాగులు బాగా పేలాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts