telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

రేపటి తరాలపైనే .. మాఫియా నీలినీడలు.. ఎందుకో…

precautions to avoid human traffic

హ్యూమన్ ట్రాఫిక్.. ఈ పదం ఎప్పటి నుండో వింటూనే ఉన్నాము. దానిని అదుపు చేయడం అభివృద్ధి చెందిన దేశాలలో కూడా సాధ్యం కావడం లేదంటే వాళ్ళ వేళ్ళు ఎంతలా పాతుకుపోయాయో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది ఇక సాదాసీదా దేశాల పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎక్కువ పిల్లల అక్రమ రవాణా జరుగుతుండటం విచారకరం. రేపటి తరాలను అపహరించి వారిని అసాంఘిక శక్తులుగా తీర్చిదిద్ది, మానవ బాంబులుగా, మాదక ద్రవ్యాల సరఫరాలకు, ఆయా ఉగ్ర సంస్థల సైన్యంగా, ఇక బాలికలను వ్యభిచారానికి వాడుకుంటున్నారు. ఇంకా క్రూరంగా అంటే, అవయవాలను అమ్ముకునే మాఫియా కి కూడా ఈ పిల్లలను సరఫరా చేస్తుంటారు. వీరి నుండి జాలి, దయ లాంటివి ఆశించడం మూర్కత్వమే అవుతుంది. బహుశా ఈ పనులకు పాల్పడే వాళ్ళు కూడా ఒకప్పుడు ఇలాంటి మానవ అక్రమ రవాణా బాధితులైన ఆశ్చర్యపోనక్కరలేదు. మొత్తానికి ఈ నేరస్తులను పట్టుకోవడం కూడా సాధ్యం అయ్యే పని కాదని, వాళ్ళ నెట్ వర్క్ అంత పకడ్బందీగా ఉంటుందని అధికారులే ఒప్పుకుంటుండటం విశేషం.

పెరుగుతున్న జనాభాతో ఈ అక్రమ రవాణా పెద్ద ప్రభావం చూపకపోయినా కూడా, కొద్దికొద్దిగా రేపటి తరాలు అంతమైపోతున్నాయనేది బహిరంగ రహస్యమే. ఇందులో భారీ నగదు కోసం ఆశపడుతూ, ఈ నేరాలకు సహకరించే మృగాలు లేకపోలేదు. వీటన్నిటి నుండి మన బిడ్డలను రక్షించుకోడానికి ఉన్న ఒక్కటే మార్గం, ముందస్తు జాగర్త. ఈ నేరాలు చేసే వారు మన మధ్యనే ఉన్నారు కాబట్టి, కాస్త మానసికంగా సిద్ధంగా ఉంటె సులభంగానే వారిని గుర్తించవచ్చు. వీళ్ళు వాడే వాహనాలు ప్రత్యేకంగా ఉంటాయి. బయటనుండి అంతా లాక్ చేసినట్టే ఉండి, ఊరికే పార్క్ చేసినట్టుగా ఉంటాయి, కానీ అందులో ముష్కరులు ఉంటారు. అటువైపుగా వెళ్తున్న పిల్లలను రెప్ప పాటులో పట్టుకొని, వాహనంలో పరారైపోతారు. అలాంటి అనుమానిత వాహనాలు జనజీవన స్రవంతిలో ఎక్కడ కనిపించినా వాటికి దూరంగా ఉంది, అధికారులకు పిర్యాదు చేయాలి. అలా కాదని, ఏదో ఆలోచలనో మీ వాహనం వద్దకు వెళ్లారంటే, ఆ పక్కనే ఉన్న ముష్కరులకు మీరు అవకాశం ఇచ్చినట్టే. ఒక్కసారి అపహరణ జరిగితే విచారణ పేరుమీద పోలీస్ స్టేషన్ల చుట్టూ దశాబ్దాలు తిరిగినా ప్రయోజనం శూన్యం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, అందుకే ముందస్తు జాగర్త అవసరం, తస్మాత్ జాగర్త!

Related posts