telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్30 మూవీ అప్డేట్ – గూస్‌బంప్స్ తెప్పించిన డైలాగ్స్

యంగ్ టైగర్​ ఎన్టీఆర్​ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్​ వచ్చేసింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా కావడంతో మరింత హైప్‌ నెలకొంది.

మే 20 తారక్​ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్​లుక్​ మోషన్​ పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్​. ఇందులో గంభీరమైన డైలాగ్ తో తారక్​ కత్తి పట్టుకుని మాస్​ లుక్​లో కనిపించి పూనకాలు తెప్పించారు. 

‘‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా… ’’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌ను తారక్ చెప్పిన విధానంతో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వచ్చాయి. తారక్‌ను ఈసారి మరింత పవర్ఫుల్ పాత్రలో కొరటాల ప్రెజెంట్ చేయనున్నాడని ఈ అప్‌డేట్‌లోనే చెప్పేశాడు

“అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తాను ఉండకూడదని.అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా” అంటూ ఎన్టీఆర్​ చెప్పే పవర్​ఫుల్​ డైలాగ్​ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. దీనికి తోడు బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అదిరిపోయింది.

మొత్తంగా ఈ సినిమా పవర్​ఫుల్​ యాక్షన్​ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్​ 30గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రశాంత్​నీల్​తో చేయబోయే సినిమా అప్డేట్​ మే 20న రానుంది.

Related posts