యంగ్ హీరో ఆది పినిశెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హీరోయిన్ నిక్కీ గల్రానీని మే 18న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రాత్రి వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలను ఆది పినిశెట్టి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘కొత్త ప్రయాణంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అందరి ప్రేమ, ఆశీస్సులు అందించండి’ అంటూ ఆది తన పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నూతన జంటకు ప్రముఖులు, సహా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా కొన్ని రోజులుగా ఈయన హీరోయిన్ నిక్కీ గల్రాని తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ద్దరూ కలిసి అప్పట్లో మరకతమణి సినిమాలో కలిసి నటించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తాజాగా వీళ్లిద్దరు పెద్దల సమక్షంలో ఇప్పుడు భార్యాభర్తలుగా బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.