తమిళ స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ పెళ్ళికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అనీశా రెడ్డితో నిశ్చితార్ధం జరుపుకున్నారు కూడా. మార్చి 10న వీరి ఎంగేజ్‌మెంట్ జరగగా, అక్టోబర్‌లో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ఏంటంటే… వీరి పెళ్లి ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుంది. అనీషా తమ నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలతో పాటు విశాల్‌తో దిగిన ఫోటోలని పర్సనల్ ఎకౌంట్ నుండి డిలీట్ చేయడం వలన అభిమానులలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. మరి దీనిపై ఇద్దరిలో ఎవరైన స్పందిస్తారా అనేది చూడాలి. విశాల్ రీసెంట్‌గా “అయోగ్య” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
previous post