telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈ చిన్న చిట్కా పాటిస్తే.. కేవలం 4 గంటల్లో షుగర్‌ మటాష్‌!

మనదేశంలో ప్రతి రోజూ ఉల్లిపాయ లేనిదే ఏ కూరా చేసుకోము. ఎందుకంటే ఉల్లిపాయ వేయకపోతే… కూర రుచికరంగా ఉండదు. ముఖ్యంగా నాన్‌వెజ్‌ వంటకాల్లో చక్కని వాసన, రుచి రావాలంటే ఉల్లిపాయలదే కీలక పాత్ర. అయితే… కేవల్ రుచికే కాదు… మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది ఉల్లిపాయ. ఈ క్రమంలోనే ఉల్లిపాయలను రోజూ తింటే షుగర్‌ బాగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయానాల్లో తేలింది. 100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలను తింటే కేవల్ 4 గంటలల్లోనే షుగర్‌ తగ్గుతుందట. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారు ఉల్లిపాయలను తింటే వారిలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ తగ్గి తద్వారా షుగర్‌ కూడా అదుపులోకి వస్తుందట. ఈ విషయాన్ని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ ఇన్‌సైట్స్‌ అనే జనరల్ ప్రచురించింది. 100 గ్రాముల ఎర్ర ఉల్లిపాయలను తింటే 4 గంటల వ్యవధిలో బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌ అవుతుందని సైంటిస్టులు తేల్చారు. కాబట్టి టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్న వారు రోజూ ఎరుపుఏ రంగులో ఉండే పచ్చి ఉల్లిపాయలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Related posts