telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీతో దిశాపటాని రొమాన్స్ !

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అరిస్తారు. అయితే తాజాగా అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్లు తప్ప మారె అప్డేట్ రాలేదు. అయితే.. ఇటీవలే పుష్ప మూవీ టీజర్‌ రిలీజ్‌ అయింది. “ఇంట్రడ్యూసింగ్‌ పుష్ప రాజ్” అంటూ యూనిట్ ఈ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో బన్నీ ఊర మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్‌ తగ్గేదే లే అనే డైలాగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  ఇక ఈ సినిమాలో అద్భుతమైన ఐటమ్ సాంగ్ ఉంది. అందులో బన్నీతో కలసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశాపటాని చిందేయబోతోందట. ఈ విషయాన్ని దిశానే బట్టబయలు చేసింది. ఇంటర్ నేషన్ డాన్స్ డే సందర్భంగా మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన దిశా బన్నీతో కలసి చిందేయబోతున్న విషయాన్ని రివీల్ చేసింది. ఇటీవల సల్మాన్ తో కలిసి ‘రాదే’లో సీటీమార్ సాంగ్ లో స్టెప్పేసింది దిశాపటాని. అయితే ఇందులో సల్మాన్ డాన్స్ విమర్శలపాలైనా… దిశాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. 

Related posts