telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ అప్డేట్ అప్‌డేట్‌ వచ్చేసింది.. అసలు సంగతి ఏంటంటే ?

RRR

నిన్న ఒక అప్డేట్ ఇచ్చి మీ అందరినీ ఖుషీ చేస్తామని ప్రకటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూనిట్ అందుకు తగ్గట్టుగానే అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ట్విట్టర్ లో ఒక వీడియో విడుదల చేసి ప్రకటించింది. మార్చ్ లో షూటింగ్ ఈ కరోనా వలన షూటింగ్ ఆపేసామని షూటింగ్ తర్వాత మూలన పెట్టేసిన తుపాకులు, ఇతర షూటింగ్ పరికరాలని దుమ్ము దులుపుతూ ఈ వీడియో రూపొందించారు. అంతే కాదు ‘విశ్రాంతి.. పునరుత్తేజం.. ఉత్సాహంతో ముందుకు..’ అంటూ #WeRRRBack అనే హ్యాష్‌ట్యాగ్‌ ను కూడా ఈ వీడియోకి జోడించారు.

దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కతోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్‌చరణ్‌ కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనుండగా… కొమరంభీమ్‌గా కనిపించనున్న ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించనుంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, తమిళ నటుడు సముద్ర ఖని, హాలీవుడ్‌ నటీనటులు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవ్‌సన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts