telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు జేమ్స్‌బాండ్‌ ..కౌబాయ్‌ ..సూపర్ స్టార్ కృష్ణ బ‌ర్త్‌డే స్పెషల్ స్టోరీ..

తొలి తెలుగు జేమ్స్‌బాండ్‌, తొలి కౌబాయ్‌, తొలి 70ఎమ్ ఎమ్, తొలి సినిమా స్కొప్‌ లాంటి ఎన్నో సాంకేతికతలను తెలుగు తెరకు పరిచయం చేసిన‌ సూపర్‌స్టార్‌ కృష్ణ.. నేటితో 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ యేట అడుగుపెడుతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ 1943వ సంవత్సరం, మే 31వ తేదీన గుంటూరు జిల్లా, బుర్రిపాలెంలో జన్మించారు. చిన్నప్పటినుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్న కృష్ణ చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో నటించారు. ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నారు. ఆ అనుభవంతోనే 1965లో వచ్చిన ‘తేనె మనసులు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. తెలుగులో తొలిపూర్తి స్థాయి కలర్‌ సినిమా కూడా ఇదే.

ఆ త‌రువాత ‘గూఢచారి 116’ లాంటి స్పై సినిమా చేసి తొలి సారి బాండ్‌ క్యారెక్టర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ సినిమాతో మాస్ అండ్‌ యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణ.

Krishna 50 Years | Super Star Krishna | Krishna Mahesh Babu | Krishna 50 Years In Telugu Industry | Krishna Telugu Hero | Facts About Krishna | Krishna 50TH Anniversary | - Filmibeat

ఆ తరువాత కృష్ణ చేసిన మరో ప్రయోగం కౌబాయ్‌. తెలుగు నేటివిటికి అసలు సంబందం లేని కౌబాయ్‌ పాత్రతో కూడా సంచలనం సృష్టించాడు కృష్ణ. 1970లో మొసగాళ్లకు మొసగాడు సినిమాతో తెలుగు తెర మీద కౌబాయ్‌ క్యారెక్టర్‌లకు స్వాగతం పలికాడు. తరువాత ఈ సినిమా ఇంగ్లీష్‌లోకి కూడా డబ్‌ అయి హాలీవుడ్‌లో రిలీజ్‌ అయింది.

Krishna 50 Years | Super Star Krishna | Krishna Mahesh Babu | Krishna 50 Years In Telugu Industry | Krishna Telugu Hero | Facts About Krishna | Krishna 50TH Anniversary | - Filmibeat

కృష్ణ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌ అల్లూరి సీతారామరాజు. ఎన్నో ఎళ్లుగా ఎన్టీఆర్‌ చేయాలనుకుంటూ ఆగిపోతున్న అల్లూరి క్యారెక్టర్లో నటించిన కృష్ణ ఈ సినిమాతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు.సొంత బ్యానర్ పై భారీ వ్యయ ప్రయాసలకి ఓర్చి ఆయన నిర్మించిన ఈ సినిమా, సంచలనానికి సరైన అర్ధం చెప్పింది. కృష్ణ పేరు ప్రతిష్టలని ఎవరెస్టు శిఖరమంత ఎత్తులో నిలిపింది.

Alluri Seetarama Raju

ఈనాడులో పవర్ ఫుల్ కేరక్టర్ ని పోషించారు. కార్మిక – శ్రామిక పక్షాన నిలిచి అవినీతి రాజకీయాలపై సమర శంఖాన్ని పూరించే శక్తిగా కృష్ణ కనిపిస్తారు. ఈ సినిమాతో జనం మెచ్చిన నటుడుగా నీరాజనాలు అందుకున్న కృష్ణ. ఏకలవ్య, అడవి సింహాలు, ముందడుగు, శక్తి, పచ్చని కాపురం, పల్నాటి సింహం, సింహాసనం.. వంటి చిత్రాలతో ఘన విజయాల్ని అందుకున్నారు.

Wishes pour in for Superstar Krishna on his 77th birthday | Telugu Movie News - Times of India

అనంతరం అనేక బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌లు ఇచ్చిన ఆయన డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారు. కృష్ణ కేవలం సాహసానికే కాదు డెడికేషన్‌కు కూడా పెట్టింది పేరు అందుకే ఆయన ఒక టైంలో ఒకే సంవత్సరం 17 సినిమాలు విడుదల చేసి సంచలనం సృష్టించాడు.. అంతేకాదు ఆ 17 సినిమాల్లో 9 సినిమాలు 100 రోజులు ఆడటం మరో విశేషం.. తెలుగు సినిమాను ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మహనీయుల్లో కృష్ణ ఒక‌రు.

Real Hero Songs - Star Star Super Star - Krishna, Ravali - HD - video Dailymotion

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలకు మారుపేరుగా నటనలో ఎప్పటికీ సూపర్‌ స్టార్‌గా అభిమానులకు ఎవర్‌గ్రీన్‌ హీరోగా ఖ్యాతి సాధించిన కృష్ణగారికి న‌వ్య మీడియా పుట్టినరోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తుంది.

 

Related posts