telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అండర్ వాటర్ లో అలియా భట్ సెక్సీ ఫోటోషూట్… నెటిజన్లు ఫిదా

Alia

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. తాజాగా అలియా భట్‌ లీడ్‌ రోల్‌లో “గంగూభాయ్‌ కతియవాడి” అనే సినిమా తెరకెక్కించ‌నున్నాడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ. జ‌యంతిలాల్ గ‌డా అనే పాత్రికేయురాలు రాసిన ఓ బుక్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో ముంబై గ్యాంగ్‌స్టర్‌గా కొత్త అవతారం ఎత్తనుంది అలియా భట్‌. ఇక రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుంది అలియా. ఈ చిత్రంతో పాటు బ్ర‌హ్మాస్త్రా, సడక్ 2, తఖ్త్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అలియా భట్ అండర్ వాటర్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ప్రముఖ మ్యాగజైన్ వోగ్ కోసం అలియా ఈ షూట్‌లో పాల్గొన్నారు. ఓ అందమైన స్విమ్మింగ్ పూల్‌లో కళ్లు చెదిరే బికినీలు, డ్రెస్సులు వేసుకుని పూర్తిగా నీళ్లలో మునిగి అలియా ఫొటోలకు పోజులిచ్చారు. అలియాలాగే ఆమె ఫొటోలు కూడా చాలా సెక్సీగా ఉన్నాయి. ఈ ఫొటోలను అలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే దాదాపు 20 లక్షలకు మందికి పైగా లైక్ చేశారు. అంటే అవి ఎంత సెక్సీగా ఉన్నాయో ఊహించవచ్చు. అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా ఈ కొత్త ట్రెండ్‌కు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

🧜‍♀️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

 

View this post on Instagram

 

🐠

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

Related posts