telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబు 40 సంవత్సరాల కాఫీ తాగే అలవాటును ఎందుకు మానుకున్నారంటే ?

Sobhan-Babu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. శోభన్ బాబు 40 సంవత్సరాల కాఫీ తాగే అలవాటును ఎందుకు మానుకున్నారు ?… కాదు కాదు ఎందుకు మానుకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాము.

దాదాపు 40 – 45 సంవత్సరాల నుంచి ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగడం శోభన్ బాబుకు అలవాటు. అయితే ఒకానొక కారణంతో ఆయన ఆ అలవాటును మానుకోవాల్సి వచ్చింది. “ఏవండీ ఆవిడ వచ్చింది” సినిమా షూటింగ్ లో జరిగిన అనుభవమే దీనికి కారణం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎక్కడో ఓ పల్లెలో షూటింగ్ జరుగుతోంది. ఓ రోజు ఉదయం కాఫీ అడిగారు శోభన్ బాబు. రాలేదు. తాగకుండానే షూటింగ్ కు వెళ్లిపోయారు. మరునాడు ఉదయం శోభన్ బాబు మళ్ళీ కాఫీ అడిగారు… రాలేదు… మళ్ళీ షూటింగుకు వెళ్లిపోయారు ఆయన. అలా వరుసగా నాలుగు రోజులు కాఫీ తాగని పరిస్థితి. దీంతో శోభన్ బాబు నాలుగు రోజులు కాఫీ తాగకుండా ఉండగలిగాను కదా… ఎందుకు శాశ్వతంగా కాఫీ తాగకుండా ఉండలేను ? అని ఆలోచించుకున్నారు. అప్పటికప్పుడే కాఫీ మానేయాలనే నిర్ణయానికొచ్చారు ఆయన. అంతే ఆ నాలుగు రోజుల అనుభవంతో కాఫీ తాగడం మానేశారు ఆయన.

అయితే ఆ తరువాత జరిగిన ఓ సంఘటన ఆయనకు మళ్ళీ కాఫీ తాగాలనిపించేలా చేసింది. అదేంటంటే… శోభన్ బాబు ఒకసారి ఫ్లైట్ లో వెళ్తుండగా… చుట్టూ ఉన్నవారంతా కాఫీ తాగుతున్నారు. కాఫీ వాసన అద్భుతంగా వస్తోంది. ఇంకేముంది శోభన్ బాబుకు కాఫీపై మనసు లాగింది. పక్కనే ఉన్న తెలిసిన వారు కూడా శోభన్ బాబును కాఫీ తాగమంటూ బలవంతపెట్టారు. ఆ సమయంలో కాఫీ విషయంలో శోభన్ బాబు కాస్త వీక్ అయ్యారనే చెప్పొచ్చు. దీంతో నేనెందుకు మళ్ళీ కాఫీ తాగొద్దు ? అంటూ ఆయన్ను ఆయనే ప్రశ్నించుకున్నారు. అయితే అప్పటికే ఆయన కాఫీ తాగి దాదాపు మూడేళ్లు అవుతోంది. కానీ ఆ ప్రలోభాన్ని ఆపుకోలేక కాఫీ కప్పు తీసుకుని, గట్టిగా వాసన పీల్చి పక్కన పెట్టేశారు శోభన్ బాబు. అలా కాఫీ వాసన చూసి తృప్తి పడ్డారు. ఇలాగె జీవితంలో దేన్నయినా కంట్రోల్ గా, లిమిట్ లో ఉంచుకోవాలన్నది శోభన్ బాబు ఫిలాసఫీ.

 

ఇవి కూడా చదవండి

శోభన్ బాబు సభలకు, సమావేశాలకు వెళ్లేవారు కాదు… ఎందుకంటే…?

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

జయలలితతో శోభన్ బాబు డిన్నర్…

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

 

Related posts