నటిగానే కాకుండా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ గురించి అందరికి తెలుసు. భద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మరాఠీ.. ఆనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పవన్ తో తప్పా మరో హీరోతో సినిమా చేయలేదు. జానీ సినిమా తరువాత పవన్ ను వివాహం చేసుకున్నది. ఇంతవరకు బాగానే ఉన్నది. కొంతకాలం తరువాత కొన్ని మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. పవన్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అటు రేణు కూడా మరో వివాహం చేసుకోవడానికి సిద్ధం అయ్యిందనే వాదనలు వినిపించాయి. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నది అనే దానిపై కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. రీసెంట్ గా రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి ఫోటో దిగింది.
దానిని సోషల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు. దీనిపై ఓ వెబ్ సైట్ రాసిన కథనాన్ని రేణు తప్పుపట్టింది. పవన్ పిల్లలతో.. పవన్ మాజీ భార్య అని కాప్షన్ ఇచ్చారట. దీన్ని చూసిన రేణు దేశాయ్ కు పిచ్చ కోపం వచ్చేసింది. ఆ ఫోటో స్టోరీ రాసిన వ్యక్తిని చెడామడా తిట్టేసింది. ఇప్పుడే ఒకరు నాకిది పంపించారు.. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఇలా బాధ పెట్టకూడదు ఎప్పుడూ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. నిజానికి సదరు వెబ్ సైట్ లో ఎలాంటి స్టోరీ లేదు. కేవలం ఫోటోకు రైటప్ మాత్రమే. ఆ రైటప్ ఆమె మనసును ఎంతగా గాయం చేసి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.