నయనతార ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు ఎంతో అభిమానం. లేడి సూపర్ స్టార్‌గా నయన్ తన కెరీర్‌ను ఇంకా హై రేంజ్ తీసుకుంది. అయితే… ఇవాళ నయనతార 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ, అభిమానులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ప్రేయసి నయన్‌కు బర్త్ డే విషెష్ చెప్పాడు. నయన్ ఫోటోలను సోషల్ మీడియా పోస్టు చేస్తూ.. “హ్యపీ బర్త్ డే బంగారం.. నువ్వు ఎల్లప్పుడూ అదే స్పూర్తినిస్తూ, అంకితభావంతో నిజాయితీ గా ఉండు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను సంతోషం, విజయాలతో ఆశీర్వదిస్తాడు. పాజిటివిటీ, అద్భుతమైన క్షణాలతో ఎంజాయ్ చేయాలి” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు విఘ్నేశ్ శివన్. కాగా.. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తమిళ్ మూవీ “నెట్రికన్”. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నెష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. గృహం సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్ రౌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నయనతార బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు ఈ సినిమా యూనిట్. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించబోతోంది నయనతార.