ఐపీఎల్ 2020 లో ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని పంజాబ్ బౌలర్లు బాగానే కట్టడి చేసారు. వరుసగా ఢిల్లీ బ్యాట్స్మెన్స్ పెవిలియన్ కు చేరుకుంటున్న ఓపెనర్ శిఖర్ ధావన్ చివరివరకు నిలబడి 61 బంతుల్లో 106 పరుగులు చేయడంతో తో ఢిల్లీ నిర్ణిత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన పంజాబ్ పవర్ ప్లే లోనే టాప్ 3 వికెట్లను కోల్పోయింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్ 28 బంతుల్లో 53 పరుగులతో అర్ధశతకం చేసి మ్యాచ్ ను పంజాబ్ వైపుకు తిప్పి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మిగిత ఆటగాళ్లు నెమ్మదిగా పరుగులు చేస్తూ చివరికి జేమ్స్ నీషమ్ సిక్స్ బాదడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది పంజాబ్. ఇక ఢిల్లీ బౌలర్లలో కగిసో రబాడా 2 వికెట్లు సాధించగా అక్షర్ పటేల్ , రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే వరుస విజయాలతో ఉన్న ఢిల్లీకి షాక్ ఇస్తూ పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి వచ్చింది.
previous post
next post