తెలంగాణ పట్టభద్రతుల ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అటు పల్లా, ఇటు పీవీ కూతురు సురభివాణీ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. ఈ విజయంతో టీఆర్‌ఎస్ భవన్‌లో నిన్న కార్యకర్తలు, కీలక నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అయితే.. ఎమ్మెల్సీగా గెలిచిన వాణీ దేవి.. ఇవాళ పీవీ నర్మింహారావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన మీద పెద్ద బాధ్యత ఉందని తెలుసని..అన్ని ధైర్యంగా ఎదురుకొంటానని పేర్కొన్నారు. ఒక ఐడియాలజీతో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని..ఇలాంటి సందర్భంలో తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని తెలిపారు. మా తండ్రి పివిని చూసి ఓటేశారు.. అంతేగాక సీఎం ఆశీస్సులు ఉండటం కూడా కలిసి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. గణనీయమైన మెజారిటీ తో తనను గెలిపించునందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ తమ భుజాలపై వేసుకొని తనను గెలిపించారని..సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అన్నారు. ఇంత పెద్ద బాధ్యత తనపై పెట్టారని.. అవన్నీ సమర్థవంతంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. పీవీ… దేశ ప్రజలకు చేసిన సేవ మర్చి పోలేనని..ఇక్కడి నుండే ప్రచారం మొదలుపెట్టాను..గెలిచి మళ్ళీ ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ఎమ్మెల్సీగా గెలిచి రావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు.
నాలుగు పార్టీలు మారిన రేవంత్ నిరాశ, నిస్పృహలతో ఉన్నాడు..